మునుగోడు అభివృద్ధి కోసం కేసీఆర్పై పోరాటం చేశాం:ఎమ్మెల్యే రాజ్గోపాల్రెడ్డి

మునుగోడు అభివృద్ధి కోసం కేసీఆర్పై పోరాటం చేశాం:ఎమ్మెల్యే రాజ్గోపాల్రెడ్డి

నల్లగొండ: మునుగోడు అభివృద్ది కోసం కేసీఆర్ పై పోరాటం చేశామన్నారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్గోపాల్రెడ్డి.రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటులో కమ్యూనిస్టుల పాత్ర ఉందన్నారు. చర్లగూడెం ప్రాజెక్టుకు నీళ్లు ఎక్కడినుంచి తేవాలో కూడా కేసీఆర్ కు క్లారిటీ లేకుండే.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎదుల దగ్గర నుంచి నీళ్లు వచ్చే విధంగా టెండర్లు వేసి పనులు ప్రారంభించిందన్నారు. 

గత ప్రభుత్వంలో రాష్ట్రం అథోగతిపాలైందన్నారు.  అప్పుల పాలైన తెలంగాణను గాడిలో పెట్టాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉందన్నారు రాజ్గోపాల్రెడ్డి.15నెలలుగా   అసెంబ్లీకీ రానీ ప్రతిపక్ష నేత కేసీఆర్ మాట తెలంగాణ ప్రజలు వినే పరిస్థితిలో లేరన్నారు. 

►ALSO READ | జర్నలిస్టుల సమస్యల పరిష్కరంలో జాప్యం తగదు:TWJF రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య

- తెలంగాణ ఉద్యమ ద్రోహులు కేసీఆర్ ప్రభుత్వంలో మంత్రులుగా పని చేశారని విమర్శించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సీపీఐ పార్టీ, సిపిఎం,కాంగ్రెస్ కలిసి పని చేస్తుందన్నారు. పార్టీలు వేరు అయినా మా ఆశయం ఒక్కటే.. పేద ప్రజలకు న్యాయం చేయడమే లక్ష్యమన్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.