ప్రతి నెల అటెండెన్స్ రికార్డ్ చెక్ చేస్తా: ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి

సేవ చేయాలనే కమిట్మెంట్ ఉన్న వాళ్లే ఆస్పత్రిలో పనిచేయాలి.. లేకపోతే వెళ్లిపోవాలని డాక్టర్లను హెచ్చరించారు మునుగోడు ఎమ్మెల్యే  రాజగోపాల్ రెడ్డి.  మర్రిగూడ మండలంలోని 30 పడకల సామాజిక ఆరోగ్య  కేంద్రంలో వైద్యాధికారులు స్థానికులతో కలిసి వైద్యంపై సమీక్ష నిర్వహించారు.  ఈ సందర్బంగా ఎక్విప్మెంట్, టెక్నికల్ స్టాఫ్, నాన్ టెక్నికల్ స్టాఫ్ లతో కూడిన పూర్తి వివరాలు ఇవ్వాలని వైద్య అధికారులను ఆదేశించారు.  వైద్యం కోసం ఇక్కడికి వచ్చే ప్రతి వ్యక్తికి ప్రాపర్ గా రెస్పాండ్ కావాలని సూచించారు.  సరైన గైడెన్స్ ఇవ్వాలని  వైద్య సిబ్బందికి సూచించారు.  ఆస్పత్రికి ట్రీట్ మెంట్ కు వచ్చే వ్యక్తులపై సిబ్బంది  పద్దతిగా నడుచుకోవాలని హెచ్చరించారు. 

ఇప్పటి నుంచి ప్రతి మనిషి హెల్త్ ట్రాక్ ను రికార్డ్  చేయాలని అధికారులను ఆదేశించారు రాజగోపాల్ రెడ్డి.   ప్రభుత్వ ఆస్పత్రికి వస్తే ట్రీట్ మెంట్ బాగా దొరుకుతుందని నమ్మకం కలిగేలా పనిచేయాలని డాక్టర్లకు సూచించారు. ఇప్పటి నుంచి ప్రతి నెల అటెండెన్స్ రికార్డ్ చేస్తానని చెప్పారు రాజగోపాల్ రెడ్డి. ఆస్పత్రిలో పనిచేసే తమకు రక్షణ లేదని  చెప్పడంతో  ఫీ మేల్ స్టాఫ్ కు భద్రత కల్పించాలని  ఎస్ ఐని ఆదేశించారు రాజగోపాల్ రెడ్డి.