భైంసా, వెలుగు : రోడ్డు ప్రమాదాలతో పాటు ఇతర ఎమర్జెన్సీ టైంలో గవర్నమెంట్ హాస్పిటల్‌కు వచ్చే రోగులను ప్రైవేటు హాస్పిటళ్లకు ఎందుకు పంపుతున్నారని ముథోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ డాక్టర్లపై ఫైర్ అయ్యారు. శుక్రవారం భైంసా ఏరియా హాస్పిటల్‌ను తనిఖీ చేసి వైద్యులతో పాటు సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు.
కొంత మంది వైద్యులు ఇక్కడికి వచ్చే రోగులను తమ తమ ప్రైవేటు హాస్పిటళ్లకు తరలించుకుపోతున్నట్లు ఫిర్యాదులు వచ్చాయన్నారు. హాస్పిటల్‌కు చెడ్డ పేరు తెచ్చేలా ఎవరూ వ్యవహారించిన ఉపేక్షించబోమన్నారు. ఇందులో సూపరిండెంట్ డా. కాశీనాథ్, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.