భైంసా, వెలుగు: ముథోల్ నియోజకవర్గంలో ఆలయాల నిర్మాణాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు ఎమ్మెల్యే రామారావు పటేల్ తెలిపారు. లోకేశ్వరం మండలం మన్మథ్ గ్రామంలో రామమందిర నిర్మాణానికి ప్రభుత్వం నుంచి రూ.50 లక్షలుమంజూరు చేస్తూ బుధవారం భైంసాలోని తన క్యాంపు ఆఫీస్లో ఆ గ్రామస్తులకు ప్రొసిడింగ్స్ అందజే శారు.
పురాతన ఆలయాల పునర్నిర్మాణాలకు సైతం దశల వారీగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఆలయ కమిటీ చైర్మన్ పృథ్వీరాజ్, వీడీసీ అధ్యక్షుడు ఆలూరి శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.