కుభీర్ మండలంలో రూ.7.68 కోట్లతో రోడ్డు పనులు ప్రారంభం

కుభీర్ మండలంలో రూ.7.68 కోట్లతో రోడ్డు పనులు ప్రారంభం

కుభీర్/భైంసా, వెలుగు: గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెడుతున్నామని ముథోల్​ ఎమ్మెల్యే రామారావు పటేల్ అన్నారు. కుభీర్ మండలంలోని డోడర్న నుంచి మహారాష్ట్ర బార్డర్ వాసి వరకు రూ.7.68 కోట్ల ఎస్టీ ఎస్డీఎఫ్ నిధులతో రహదారి నిర్మాణానికి  మంగళవారం భూమి పూజ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. డోడర్న తండాలను కలుపుతూ ఏడున్నర కిలోమీటర్ల మేర రోడ్డు వేస్తున్నామన్నారు.

 రోడ్లు బాగు పడితేనే అభివృద్ధి జరుగుతుందని, గ్రామస్తుల సమస్యలను దశల వారీగా పరిష్కరిస్తానన్నారు. డోడర్న చెరువు, రోడ్లు, తాగునీటి సమస్య పరిష్కారానికి నిధులు మంజూరు చేయించనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీలు బి.విఠల్, నగేశ్, నాయకులు ఆర్.​శంకర్, సంవ్లీ రమేశ్, పి.గంగాధర్, బీజేపీ మండల అధ్యక్షుడు యేశాల దత్తాత్రి కె.సాయినాథ్, కనకయ్య, నాగేందర్, గులాబ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

విద్యాభివృద్ధికి కృషి

విద్యాభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగుతానని, విద్యారంగంలో నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే అన్నారు. భైంసాలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో  కేంద్ర ప్రభుత్వ నిధులు ఉషా పథకం కింద రూ.3.97 కోట్లలతో నిర్మించనున్న అదనపు గదుల నిర్మాణానికి భూమి పూజ చేశారు. కాలేజీ అభివృద్ధికి మొత్తం రూ.5 కోట్లు మంజూరయ్యాయని, మిగతా నిధులను కాలేజీలో కంప్యూటర్లు, ఇతరత్ర పనుల కోసం వెచ్చిస్తామన్నారు. ప్రిన్సిపాల్ కె.బుచ్చయ్య, మున్సిపల్ మాజీ చైర్మన్ బి.గంగాధర్, డాక్టర్ నగేశ్​తో పాటు పట్టణ మండల బీజేపీ నాయకులు,  కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.