- ప్రతి రోజూ ప్రజాదర్బార్ నిర్వహిస్తాం..
- ముథోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్
భైంసా, వెలుగు : నియోజకవర్గంలోని అన్నీ మతాల ప్రజలను గౌరవించి, అందుబాటులో ఉండి అభివృద్ధి చేస్తానని ముథోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ అన్నారు. మంగళవారం భైంసాలోని తన నివాసంలో ప్రెస్మీట్ నిర్వహించారు. ప్రజలందరితో కలిసి మెలిసి ఉండి నిత్యం ప్రజాదర్భార్ నిర్వహిస్తామన్నారు. నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో కోట్లాడడమే కాకుండా.. కేంద్ర ప్రభుత్వ సహాకారంతో ప్రత్యేక నిధులు తీసుకు వస్తానని చెప్పారు. ప్రధాని మోదీ ఇచ్చిన సబ్ కా సాత్..
సబ్ కా వికాస్ నినాదాంతో ప్రజల్లోకి వెళ్తామన్నారు. తన గెలుపు కోసం సహకరించిన ప్రజలకు, కార్యకర్తలకు, నాయకులకు ధన్యవాదాలు తెలియజేశారు. అభివృద్ధిలో భాగంగా విద్య, ఆరోగ్యం, వ్యవసాయం నీటిపారుదల రంగాలకు ప్రముఖ ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి దళారి వ్యవస్థకు స్థానం లేదని, నేరుగా తనను ప్రజలు సంప్రదించవచ్చు అన్నారు. అన్ని వర్గాలను సమాన దృష్టితో చూస్తానని అన్నారు.