భైంసా ఆస్పత్రిలో ఆధునిక వైద్య పరీక్షలు

భైంసా, వెలుగు: భైంసా గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్​లో టీబీ వ్యాధి నిర్ధారణ పరీక్షల నిర్వాహణకు చర్యలు చేపట్టినట్లు ఎమ్మెల్యే రామారావు పటేల్ తెలిపారు. గురువారం భైంసా ఏరియా హాస్పిటల్ ను సందర్శించారు. చికిత్సలు పొందుతున్న రోగులతో మాట్లాడారు. అనంతరం క్యాంపు కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్​ చెక్కులు పంపిణీ చేశారు. ఏరియా హాస్పిటల్​లో వివిధ వ్యాధుల నిర్ధారణ పరీక్షల నిర్వాహణకు అవసరమైన అధునాతన పరికరాలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగానే టీబీ వ్యాధి నిర్ధారణ పరీక్షల నిర్వాహణకు అవసరమైన ట్రూనాట్​పరికరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లుగా చెప్పారు. కౌన్సిలర్​తోట విజయ్, బీజేపీ పట్టణ అధ్యక్షుడు మల్లేశ్వర్, సోలంకి భీంరావు, సుష్మారెడ్డి, తోట లింగురాం, గాలి రాజు తదితరులు పాల్గొన్నారు.

కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ

బాసర, వెలుగు: ఆడబిడ్డలకు కల్యాణ లక్ష్మి పథకం వరం లాంటిదని ఎమ్మెల్యే అన్నారు. బాసర తహశీల్దార్ కార్యాలయంలో 21 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్​చెక్కులు పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు మర్చిపోయిందని ఎద్దేవా చేశారు. కల్యాణలక్ష్మి పథకం కింద నగదుతో పాటు తులం బంగారం ఏమైందని ప్రశ్నించారు. గణేశ్ నగర్ కాలనీలో రూ.11 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు.