భైంసా, వెలుగు: మహిళలు ఆర్థిక అభివృద్ధి సాధించాలని ముథోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ అన్నారు. శనివారం భైంసాలోని గణేశ్ నగర్ మున్నూరు కాపు సంఘం భవనంలో యూనియన్ బ్యాంక్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన స్వయం సహాయక సంఘాల రుణాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రూ.7 కోట్ల 50 లక్షల రుణాలకు సంబంధించిన చెక్కులను సంఘాలకు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భైంసాలో ఎక్కువగా వ్యవసాయ ఆధారిత కుటుంబాలున్నాయని, వారికి రుణాలిస్తూ ఆర్థిక పరిపుష్టి సాధించేలా చూడాల్సిన బాధ్యత బ్యాంకు అధికారులపై ఉందన్నారు. కార్యక్రమంలో భైంసా ఎంపీపీ అబ్దుల్ రజాక్, మున్సిపల్ మాజీ చైర్మన్ బి.గంగాధర్, నాయకులు రావుల పోశెట్టి, ఐకేపీ ఏపీఎంలు, బ్యాంకు అధికారులు పాల్గొన్నారు.
దశల వారీగా గ్రామాల అభివృద్ధి
కుంటాల: దశల వారీగా నియోజకవర్గంలోని గ్రామాల అభివృద్ధికి పాటుపడుతానని ముథోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ అన్నారు. శనివారం కుంటాల మండల కేంద్రంతోపాటు కల్లూర్ లో పలు అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. కల్లూర్ లో తాగునీటి పైప్ లైన్, సీ సీ రోడ్లు, కుంటాలలో హైస్కూలు ప్రహరీ నిర్మాణం, సీసీ రోడ్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఎంపీపీ ఆప్క గజ్జరాం, వైస్ ఎంపీపీ మౌనిక నవీన్, నాయకులు పిప్పెర వెంగళ్ రావు, గోవర్ధన్, గంగయ్య, వెంకట్ రావు, గజేందర్, గౌస్, అధికారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.