- జాతీయ బీసీ కమిషన్ చైర్మన్హన్సరాజ్కు ఎమ్మెల్యే విజ్ఞప్తి
భైంసా, వెలుగు: ఆరె మరాఠాతో పాటు 28 కులాలను ఓబీసీ జాబితాలో చేర్చాలని ముథోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్బుధవారం ఢిల్లీలో జాతీయ బీసీ కమిషనర్ చైర్మన్హన్సరాజ్గంగారాం, పలువురు కేంద్ర మంత్రులను కలిసి వినతి పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆరే మరాఠా, గౌడజెట్ట, కుళ్లకడిగి, బుక్క అయ్యవార్లు తదితర 28 కులాలను ఓబీసీ జాబితాలో చేర్చాలని విజ్ఞప్తి చేశారు.
ఆయా కులాలను ఓబీసీలో చేర్చకపోవడం వల్ల విద్య, ఉద్యోగ రంగాల్లో అన్యాయానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముథోల్ నియోజకవర్గ పరిధికి సరిహద్దులో ఉన్న మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాలను అనుసంధానం చేసి రోడ్లను నిర్మించేందుకు నిధులు కేటాయించాలని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని ఎమ్మెల్యే కోరారు.