భైంసా, వెలుగు: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో ఫిబ్రవరి 1నుంచి జరిగే వసంత పంచమి ఉత్సవాలకు రావాలని కేంద్ర మంత్రి బండి సంజయ్‌తో పాటు రాష్ట్ర మంత్రి సీతక్కను ఎమ్మెల్యే రామారావు పటేల్కోరారు. ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్‌తో కలిసి మంగళవారం హైదరాబాద్‌లో మంత్రులను వేర్వేరుగా కలిసి ఆహ్వానిం చగా సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. వసంత పంచమి ఏర్పాట్లపై మంత్రి సీతక్కతో చర్చించారు.
రెగ్యులర్ ఈవోను వెంటనే నియమించాలని కోరారు. పెద్ద మొత్తంలో భక్తులు వచ్చే అవకాశం ఉందని, అన్ని ఏర్పాట్లు చేయాలని మంత్రికి ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. బాసర ఆలయ పునర్నిర్మాణ పనులను ప్రారంభించాలని కోరారు. నియోజకవర్గంలో పలు సమస్యలపై చర్చించినట్లు పటేల్ తెలిపారు. అమ్మవారి ఆలయానికి ప్రసాదం స్కీమ్‌లో కేంద్ర ప్రభుత్వం ద్వారా నిధులు మంజూరు చేయించేందుకు కృషి చేస్తానని కేంద్ర మంత్రి బండి హామీ ఇచ్చినట్లు చెప్పారు.