ఇఫ్తార్ విందులో ఎమ్మెల్యే రాంచంద్రు నాయక్​​​​​​​

నర్సింహులపేట, వెలుగు: మహబూబాబాద్ జిల్లాలోని నర్సింహులుపేట మండల కేంద్రంలో పీఏసీఎస్ డైరెక్టర్ రజినీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం మసీదులో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే రాంచంద్రు నాయక్ హాజరై మాట్లాడుతూ మైనార్టీ సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. అంతకుముందు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కార్యక్రమంలో పార్టీ మండలాధ్యక్షుడు జినుకల రమేశ్, గ్రామ అధ్యక్షుడు రామకృష్ణ, లీడర్లు వెన్నం రవీందర్ రెడ్డి, ముస్లిం మత పెద్దలు తదితరులు పాల్గొన్నారు.