కారేపల్లి, వెలుగు : ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని వైరాఎమ్మెల్యే రాందాస్ నాయక్ సూచించారు. మండలంలోని కారేపల్లి క్రాస్ రోడ్లో ఆదివారం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులకు మద్దతు ధర లభించడంతోపాటు, నగదు రైతుల బ్యాంకు అకౌంట్లో జమ అవుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సంపత్ కుమార్, ఎంపీడీవో సురేందర్, సొసైటీ చైర్మన్ దుగ్గినేని శ్రీనివాసరావు, కాంగ్రెస్ నాయకులు తలారి చంద్ర ప్రకాశ్, పగడాల మంజుల, బానోత్ రామ్మూర్తి, ఇమ్మడి తిరుపతిరావు, మేధరి టోనీ, అడ్డగోడ ఐలయ్య పాల్గొన్నారు.
ఇండోర్ షటిల్ స్టేడియం ప్రారంభం
జూలూరుపాడు : మండల కేంద్రంలో కల్లోజి బ్రదర్స్ నిర్మించిన ఇండోర్ షటిల్ స్టేడియాన్ని ఆదివారం ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ ప్రారంభించారు. మండల కేంద్రలో ఇండోర్ షటిల్ స్టేడియాన్ని ఏర్పాటు చేయడాన్ని ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా నాయకులు లేళ్ల వెంకటరెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు మంగీలాల్, కల్లోజి శ్రీనివాసరావు, ఎస్సై రాణా ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు.