వైరా నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తా : ఎమ్మెల్యే రాందాస్​ నాయక్

వైరా నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తా : ఎమ్మెల్యే రాందాస్​ నాయక్

జూలూరుపాడు, వెలుగు : వైరా నియోజకవర్గ  అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తానని ఎమ్మెల్యే రాందాస్​ నాయక్​ అన్నారు. శనివారం మండల కేంద్రంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండలపంలో  నిర్వహించిన  జై బాపు, జై భీమ్, జై సంవిధాన్  కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి, జిల్లా మంత్రులు సహయంతో సీతారామ ప్రాజెక్ట్​ ద్వారా గోదావరి జలాలు విజయవంతంగా తీసుకొచ్చామన్నారు. బీఆర్ఎస్​, బీజేపీ ఎన్ని కుట్రలు చేసినా ఎన్నికలు ముందు ఇచ్చిన హామీలన్నీ అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు.

బీఆర్ అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగాన్ని కాపాడుకోవడమే లక్ష్యంగా కాంగ్రెస్​ పార్టీ ముందకుపోతుందన్నారు. అనంతరం బేతాళపాడు గ్రామంలో  భూక్య మహేశ్ ​ఇంట్లో సన్నబియ్యంతో వండిన భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్​ఖమ్మం జిల్లా అధ్యక్షుడు పువ్వాల్ల దుర్గాప్రసాద్, జూలూరుపాడు మండల అధ్యక్షుడు మాలోత్ మంగీలాల్ నాయక్, జై బాపు జై భీమ్ జై సంవిధాన్ మండల ఇన్​చార్జి ఏనుగుల అర్జున్ రావు తదితరులు పాల్గొన్నారు.