టికెట్ రాలేదని బాధపడొద్దు:ఎమ్మెల్యే రమేశ్ బాబు

‌‌‌‌‌‌‌‌వేములవాడ, వెలుగు : టికెట్ ఖరారు కాలేదని ఎవరూ బాధపడొద్దని, సవాళ్లు వచ్చినప్పుడే దీటుగా నిలబడాలని వేములవాడ ఎమ్మెల్యే రమేశ్ బాబు చెప్పారు. తన -పౌరసత్వంపై అక్టోబర్ లో తీర్పు వచ్చే అవకాశం ఉందన్నారు. 

ఆ సమస్య పరిష్కారం అయితే అన్ని ఆటంకాలు తొలగిపోతాయని చెప్పారు. వేములవాడతో తనకు సుధీర్ఘ అనుబంధం ఉందని, అది తన ఊపిరి ఉన్నంత వరక కొనసాగుతుందన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కలిసికట్టుగా పనిచేయాలని చెప్పారు.