మదన్​లాల్​ గెలుపే లక్ష్యంగా పనిచేస్తా: రాములు నాయక్

వైరా, వెలుగు: బీఆర్ఎస్​ అభ్యర్థి మదన్​లాల్​గెలుపే లక్ష్యంగా పనిచేస్తానని ఎమ్మెల్యే  రాములు నాయక్ అన్నారు. సోమవారం  పట్టణంలోని కమ్మవారి కల్యాణ మండపంలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఎంపీ, వైరా నియోజకర్గ ఇన్​చార్జి నామా నాగేశ్వరరావు,  మదన్ లాల్  పాల్గొన్నారు.  

ఈ సందర్భంగాఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్​ మాటే శిరోధార్యమన్నారు. అయన ఏది శాసిస్తే  ఆ పని చేస్తానన్నారు.  మదన్ లాల్ మాట్లాడుతూ ఎన్నికల్లో గెలిచి కేసీఆర్ కు కానుకగా ఇస్తామన్నారు. ఎంపీ నామా మాట్లా డుతూ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మార్చిన ఘనత కేసీఆర్ దేనన్నారు. కార్యక్రమంలో  బాణాల వెంకటేశ్వరరావు, నలమల వెంకటేశ్వరరావు, మోహన్​రావు , కృష్ణార్జున్​రావు,  సీతారాములు, పావని,  కనకదుర్గ పాల్గొన్నారు.