లంచం డిమాండ్ చేస్తే జైలుకే : రవిశంకర్

కొడిమ్యాల,మల్యాల,వెలుగు : ప్రభుత్వ పథకాల అమలు కోసం లబ్ధిదారుల నుంచి లంచం డిమాండ్ చేస్తే జైలుకు పంపిస్తామని చొప్పదండి ఎమ్మెల్యే రవిశంకర్ హెచ్చరించారు. శుక్రవారం కొడిమ్యాల, మల్యాల మండలాల్లోని 900 మంది లబ్ధిదారులకు గృహలక్ష్మి ప్రొసీడింగ్స్ అందజేసారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ  రాష్ట్రంలో ఇల్లు లేని పేదలు ఉండకూడదనే సంకల్పంతో గృహలక్ష్మి స్కీంను సీఎం కేసీఆర్  ప్రవేశపెట్టారన్నారు.  కార్యక్రమంలో జడ్పీటీసీలు ప్రశాంతి, రాంమెహన్ రావు, ఎంపీపీ విమల, నాయకులు కృష్ణారావు, రాజనర్సింహ రావు, ఎంపీడీవో పద్మజ, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.