- జడ్పీ మీటింగ్‌లో బీసీ గురుకుల ఆర్సీవోపై ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ ఫైర్
- మీటింగ్‌కు రాని ఇరిగేషన్సీఈపైనా ఆగ్రహం
నల్గొండ, వెలుగు : ‘మీకు రాజ్యాలు...సామ్రాజ్యాలు ఏమైనా ఉన్నాయా? ఫోన్ఎందుకు ఎత్తరు? మీకు కావాలని సరదాగా ఫోన్చేయం కదా?’ అని దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్నల్గొండ జిల్లా బీసీ గురుకుల ఆర్సీవో షకీనాపై ఫైర్అయ్యారు. బుధవారం నల్గొండ జడ్పీ జనరల్‌బాడీ మీటింగ్‌లో గురుకుల సీట్ల భర్తీ గురించి వాడీవేడి చర్చ సాగింది. ఈ సందర్భంగా అధికారులు తమ ఫోన్ఎత్తడం లేదని ఎమ్మెల్యేతోపాటు, మునుగోడు జడ్పీటీసీ నారోబోయిన సర్వరూప రాణి మండిపడ్డారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ‘మీతో ఏం కాదని తెలుసు..అయినా సరే ఫోన్ ఎత్తడం అలవాటు చేసుకోండి. మా దగ్గరకు ఎంతో మంది వస్తుంటారు? వాళ్లను తృప్తి పర్చించేందుకు మీకు ఫోన్చేస్తుంటాం.
ఆ టైంలో మీరు ఫోన్ఎత్తకపోతే ఎట్లా? నాలుగు రోజుల కింద ఫోన్‌చేసి చేసి అలిసిపోయా? ఫోన్ఎత్తకుండా ఉండకపోవడానికి కారణం ఏందీ? మీకు రాజ్యాలు.. సామ్రాజ్యాలు ఏమైనా ఉన్నాయా?’ అని అసహనం వ్యక్తం చేశారు. జడ్పీటీసీ స్వరూప రాణి మాట్లాడుతూ ‘మీరు ఫోన్ఎత్తడం లేదంటే అక్కడేదో మాకు తెలియకుండా గూడుపుఠాణి జరుగుతుందనే అనుమానాలు వస్తున్నాయి. ఎమ్మెల్యే, ఎంపీపీ, జడ్పీటీసీలను స్థానిక ప్రోగాంలకు పిలవాలని ఎన్నిసార్లు చెప్పినా మీరు పట్టించుకోవడం లేదు. పైగా గురుకులాల్లో డ్రాపౌట్స్కింద మిగిలిపోయిన సీట్లను మీ ఇష్టం వచ్చినట్లు భర్తీ చేసుకుంటున్నారు’ అని మండిపడ్డారు.
సీట్ల భర్తీపై కలెక్టర్ఆర్వీ కర్ణన్స్పందిస్తూ ఇక నుంచి డ్రాపౌట్స్కింద మిగిలిపోయిన సీట్లను తనకు చెప్పకుండా భర్తీ చేయొద్దని, అలాగే అధికారులు ఫోన్ఎత్తాలని వార్నింగ్ఇచ్చారు. నీటిపారుదల శాఖ రివ్యూ జరిగే క్రమంలో ఏఈలు, డీఈలు వచ్చినా సీఈ రాలేదు. దీంతో ఎమ్మెల్యే రవీంద్ర కుమార్, జడ్పీ చైర్మన్బండా నరేందర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా అధికారి రాకుండా మండల, డివిజన్ స్థాయి అధికారులను మీటింగులకు పంపిస్తే ఏం ప్రయోజనం ఉంటుందన్నారు. దీంతో కలెక్టర్ కర్ణన్జోక్యం చేసుకుని అప్పటికప్పుడు చీఫ్ ఇంజినీర్‌కు ఫోన్చేయించారు. దీంతో ఆయన హుటాహుటిన సమావేశానికి వచ్చారు..