కోరుట్ల ఘటన కాంగ్రెస్ దౌర్జన్యాలకు పరాకాష్ట : రవీంద్రకుమార్​

దేవరకొండ, వెలుగు:  చందంపేట మండలంలోని కోరుట్ల ఘటన కాంగ్రెస్ దౌర్జన్యాలకు పరాకాష్ట అని  ఎమ్మెల్యే రవీంద్రకుమార్ ​మండిపడ్డారు. శుక్రవారం దేవరకొండ పట్టణంలోని తన ఇంట్లో మీడియాతో మాట్లాడుతూ..  కోరుట్ల గ్రామ సర్పంచ్​దొండేటి మల్లారెడ్డిపై కాంగ్రెస్​ నాయకులు హత్యాయత్నం చేశారని ఆరోపించారు.  గతంలో  ఎన్నడూ లేని విధంగా ఒక గ్రామంపై మరో గ్రామానికి చెందిన నాయకులు దాడి చేయడం దారుణమన్నారు.

కాంగ్రెస్​ నాయకుల దాడిలో తమ పార్టీకి చెందిన ఇద్దరు కార్యకర్తలు  గాయపడ్డారన్నారు. బాలూనాయక్​ దౌర్జన్యాలను మానుకోకపోతే  బీఆర్​ఎస్​ కార్యకర్తలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.   తాను 25 వేల మెజార్టీతో గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.ఈ సమావేశంలో ఎంపీపీ వంగాల ప్రతాప్​రెడ్డి, నేతలు టీవీఎన్​ రెడ్డి, కేసాని లింగారెడ్డి, వల్లపురెడ్డి, బొడ్డుపల్లి కృష్ణ, వేముల రాజు పాల్గొన్నారు.