కార్యకర్తపైకి కారు ఎక్కించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే ..కనీసం పట్టించుకోలేదు

నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ శంకుస్థాపన కార్యక్రమంలో అపశృతి చోటుచేసుకుంది. ప్రారంభోత్సవ కార్యక్రమానికి వస్తుండగా.. దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్ర నాయక్ కారు చిట్యాల సైదులు అనే బీఆర్ఎస్ కార్యకర్త కాలుపై ఎక్కింది. దీంతో అతనికి తీవ్ర గాయమైంది.  


సైదులు గాయపడినా ఎమ్మెల్యే రవీంద్రనాయక్ కనీసం పట్టించుకోలేదు. మంత్రులతో కలిసి ఎమ్మెల్యే రవీందర్ నాయక్ అలాగే వెళ్లిపోయాడు. గాయాలపాలైన కార్యకర్తను ఇతర బీఆర్ఎస్ కార్యకర్తలు సమీపంలో ఉన్న ఆసుపత్రికి తరలించారు. ఎమ్మెల్యే తీరుపై పలువురు కార్యకర్తలు మండిపడుతున్నారు.