
సీఎం కేసీఆర్ ఏం అభివృద్ధి చేశాడని ఓ సామాన్య మహిళ ప్రశ్నిస్తే ఆమెపై ఓ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా గ్రామపంచాయితీ సెక్రటరీని పిలిపించి ఆమెకు వస్తోన్న పెన్షన్ ఆపేయాలని హుకుం జారీ చేశారు.
ఈ సంఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. స్థానికంగా జరిగిన అత్మీయ సమ్మేళనంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ పాల్గొన్నారు .. ఈ మీటింగ్ లో సీఎం కేసిఆర్ పథకాల గురించి ప్రజలకు ఆయన వివరిస్తున్నారు. ఈ క్రమంలో తండాకు చెందిన ఓ మహిళా మధ్యలో నిలుచుని సీఎం కేసీఆర్ ఏం అభివృద్ధి చేశాడో చెప్పాలని ఎమ్మెల్యేను నిలదీసింది.
దీంతో ఆగ్రహించిన ఎమ్మెల్యే.. గ్రామపంచాయితీసెక్రటరీని పిలిచి ఆమెకు వస్తున్న పెన్షన్ ను వెంటనే ఆపేయాలని ఆదేశించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రశ్నిస్తే సమాధానం చెప్పాలి కానీ అధికారంలో ఉన్నం కదా అని ఇలాంటి హుకుం జారీ చేస్తారా అని జనాలు ప్రశ్నిస్తున్నారు.