ఎమ్మెల్యే రెడ్యా నాయక్ ను నిలదీసిన తండవాసులు 

కురవి, వెలుగు : ‘మా తండాకు ఎందుకు వస్తున్నావ్... ఏం అభివృద్ధి చేశావ్’ అంటూ మహబూబాబాద్ జిల్లా కురవి మండలం రాజోలు బాలు తండా వాసులు ఎమ్మెల్యే రెడ్యానాయక్ ను నిలదీశారు. పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు మంగళవారం తండాకు  వచ్చిన ఎమ్మెల్యేను స్థానికులు అడ్డుకున్నారు.  తండాలోకి రావొద్దని, గో బ్యాక్ రెడ్యానాయక్ అంటూ నినాదాలు చేశారు.

గత కాంగ్రెస్ హయాంలో జరిగిన అభివృద్ధే తప్పా.. బీఆర్ఎస్ ప్రభుత్వంలో అభివృద్ధి జరుగలేదన్నారు. ఎస్టీ లోన్లలో తమ తండాకు అన్యాయం జరిగిందని ఎన్ని సార్లు చెప్పినా పట్టించుకోలేదని ఆవేదన చెందారు.