అభివృద్ధి పథకాలే బీఆర్​ఎస్​ను గెలిపిస్తయ్: రెడ్యానాయక్

నర్సింహులపేట, వెలుగు : బీఆర్ఎస్ సంక్షేమ పథకాలే పార్టీని గెలుపిస్తాయని డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ అన్నారు. మంగళవారం మహబూబాబాద్ జిల్లాలోని నర్సింహులపేట మండల కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రతిపక్షాలకు అభ్యర్థులు కరువయ్యారన్నారు.

మరోసారి బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం బీఆర్ఎస్ జిల్లా లీడర్ మాజీ సర్పంచ్ బండ భిక్షం రెడ్డిని పరామర్శించారు. ఆయన వెంట పార్టీ మండల అధ్యక్షుడు మైదం దేవేందర్, సర్పంచులు ఫోరం మండలాధ్యక్షుడు మెరుగు శంకర్, సర్పంచ్ వేముల రజితరెడ్డి ఉన్నారు.