ఎమ్మెల్యే రేగా vs పోదెం వీరయ్య..స్టేజ్పైనే తిట్టుకున్న నేతలు

భద్రాద్రి కొత్త గూడెం జిల్లాలో  పినపాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే రేగా కాంతారావు, భద్రాచలం కాంగ్రెస్ ఎమ్మెల్యే పోదేం వీరయ్యకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దుమ్ముగూడెంలో  మండలం లక్ష్మీనగరం గ్రామంలో తునికి ఆకుల పంపిణీ  బోనస్ చెక్కుల పంపిణీలో ఇద్దరి మధ్య వివాదం తలెత్తింది.

భద్రాచలంలో నెక్స్ట్ గెలవబోయేది తామే అంటూ  స్టేజ్ పైన  ఎమ్మెల్యే రేగా కాంతారావు  ప్రసంగిస్తుండగా భద్రాచలం ఎమ్మెల్యే పోదెం వీరయ్య  అడ్డుకున్నారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో  పార్టీ ప్రచారం ఏమిటంటూ  ఆగ్రహం వ్యక్తం చేశారు.  స్టేజ్ పైనే మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ముందే  ఇద్దరు నువ్వెంతంటే నువ్వెంతా అంటూ ఒకరి నొకరు దూషించుకున్నారు. పోలీసులు  జోక్యం చేసుకోవడంతో వివాదం సద్గుమణిగింది.