జాన్సన్​ నాయక్​ ఎస్టీనే కాదు.. రేఖానాయక్ సంచలన వ్యాఖ్యలు

బీఆర్​ఎస్​ పార్టీలో ఎమ్మెల్యే టికెట్ల పంచాయతీ ముదురుతోంది. ఉమ్మడి ఆదిలాబాద్​ జిల్లా ఖానాపూర్​ టిక్కెట్టు ఇవ్వడానికి ప్రస్తుత సిట్టింగ్​ ఎమ్మెల్యే రేఖా నాయక్ కు బీఆర్​ఎస్​ అధిష్ఠానం నిరాకరించిన విషయం తెలిసిందే. 

ఆ టికెట్టును పార్టీ నేత జాన్సన్​నాయక్ కు ఇచ్చింది. ఈ క్రమంలో రేఖానాయక్​ చేసిన వ్యాఖ్యలు సంచలన సృష్టిస్తున్నాయి. జాన్సన్​ నాయక్​ అసలు ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వారే కాదని రేఖానాయక్​ ఆరోపించారు. 

మంత్రి పదవి ఆశిస్తున్నాననే కారణంతో బీఆర్​ఎస్ అధిష్ఠానం తనను పక్కకు పెట్టిందని  తన రాజకీయ భవిష్యత్తుపై త్వరలో నిర్ణయం ప్రకటిస్తానని ఆమె తెలిపారు. ఖానాపూర్​లో సత్తా చాటి బీఆర్​ఎస్ అభ్యర్థికి చుక్కలు చూపిస్తానని ధీమా వ్యక్తం చేశారు.