
క్యాంప్ ఆఫీస్లో జెండా ఆవిష్కరించిన ఎమ్మెల్యే భర్త
ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ తీరు వివాదాస్పదం
నిర్మల్, వెలుగు: రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో భాగంగా ఖానాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే రేఖానాయక్ క్యాంప్ఆఫీస్లో ఆమెకు బదులుగా ఆమె భర్త శ్యామ్నాయక్జాతీయ జెండా ఎగరవేయడం వివాదాస్పదమైంది. ఎమ్మెల్యే రేఖానాయక్ అందుబాటులో లేకపోవడంతో బుధవారం ప్రజాప్రతినిధులు, కార్యకర్తలతో కలిసి శ్యామ్‍నాయక్ జెండా ఎగరవేశారు. అయితే అధికారిక నివాసంలో ఎమ్మెల్యే మాత్రమే జెండా ఆవిష్కరణ చేయాలని, ఆమె భర్త ఎలా ఎగరవేస్తారని ప్రతిపక్ష పార్టీల నాయకులు మండిపడుతున్నారు. శ్యామ్‍నాయక్ ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండి కూడా రూల్స్ అతిక్రమించారని చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‍చార్జ్ భరత్‍చౌహాన్ డిమాండ్ చేశారు.