వచ్చే ఎన్నికల్లో తాను ఖానాపూర్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి, అధికార పార్టీ అభ్యర్థిని ఓడిస్తానని నిర్మల్ జిల్లా ఖానాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే రేఖా నాయక్ సవాల్ చేశారు. శుక్రవారం మంచిర్యాల జిల్లా జన్నారం మండలం రేండ్లగూడలో రామాలయం నిర్మించనున్న స్థలాన్ని ఆమె సందర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, భూ కబ్జాదారులకు, అవినీతిపరులకు టికెట్లు ఇచ్చిన బీఆర్ఎస్ పెద్దలు.. ఏ మచ్చ లేని తనకు టికెట్ ఇవ్వకుండా అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
రెండుసార్లు ఖానాపూర్ నియోజకవర్గం నుంచి గెలుపొందిన తాను, మూడోసారి గెలిస్తే మంత్రి పదవి ఇవ్వాల్సి వస్తుందన్న కారణంతో కొంత మంది పార్టీ నాయకులు కుట్ర చేసి తనకు టికెట్ రాకుండా చేశారని ఆరోపించారు. పదేండ్లుగా నిత్యం ప్రజల మధ్య ఉన్న తాను ఇండిపెండెంట్‌గానైనా పోటీ చేసి, సత్తా చాటుతానన్నారు.