సభ ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే

సభ ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే

పర్వతగిరి(గీసుగొండ), వెలుగు: వరంగల్​ జిల్లా గీసుగొండ మండలం మొగిలిచర్లలో ఆదివారం నిర్వహించే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సభ ఏర్పాట్లను పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్​రెడ్డి శనివారం పరిశీలించారు. మొగిలిచర్లలో సబ్ స్టేషన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన, మీటింగ్ ఏర్పాట్ల పనులను పరిశీలించి ఆఫీసర్లకు పలు సూచనలు చేశారు.

 నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చి సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం గీసుగొండలో ఈ నెల 11 నుంచి 15 వరకు జరగనున్న లక్ష్మీనరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాల వాల్ పోస్టర్ ఆవిష్కరించారు.