ఉపాధి కల్పనపై ఫోకస్​ పెట్టాలి

ఉపాధి కల్పనపై ఫోకస్​ పెట్టాలి

హనుమకొండ, వెలుగు: పరకాల నియోజకవర్గంలోని యువత, మహిళలు స్వయం ఉపాధి, ఉద్యోగావకాశాలను అందిపుచ్చుకునే విధంగా ఆఫీసర్లు తగిన శ్రద్ధ చూపాలని ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్​ రెడ్డి సూచించారు. హనుమకొండ కలెక్టరేట్​లో పరకాల నియోజకవర్గ పరిధిలోని కాకతీయ మెగా టెక్స్​ టైల్​పార్క్, ట్రైనింగ్ సెంటర్, పాల డెయిరీల ఏర్పాటు, నిరుద్యోగ యువతీయువకులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే జాబ్ మేళాల నిర్వహణపై హనుమకొండ, వరంగల్ కలెక్టర్లు ప్రావీణ్య, సత్య శారద, ఇతర అధికారులతో శనివారం రివ్యూ చేశారు. 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళలు, యువత సంక్షేమం కోసం చేపడుతున్న వివిధ కార్యక్రమాల్లో ఎన్నారైల భాగస్వామ్యం ఉండేలా చూడాలన్నారు. ఉపాధి కోసం సబ్సిడీ పథకాలు అందేలా చర్యలు చేపట్టాలన్నారు. రైతులతో ఏర్పాటు చేసిన సొసైటీలు పాడి రంగంలో రాణించేలా చూడాలన్నారు. పాల డెయిరీల ఏర్పాటు చేసేందుకు ముందుగా ముల్కనూర్ సొసైటీలో శిక్షణ కార్యక్రమం నిర్వహించేందుకు అధికారులు కృషి చేయాలన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఇప్పటివరకు దాదాపు 3,500మంది ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం నమోదు చేసుకున్నారని, ఇందుకోసం ఏప్రిల్ 4 న జాబ్ మేళా నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు.