- ఎమ్మెల్యే రోహిత్‌రావు
మెదక్‌టౌన్, వెలుగు: ఫొటోగ్రాఫర్ల సంక్షేమానికి తనవంతు సహకారం అందిస్తానని ఎమ్మెల్యే రోహిత్ రావు అన్నారు. గురువారం పట్టణంలో జరిగిన ఫొటోగ్రాఫర్స్ జిల్లా నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర యూనియన్ ఫొటో అండ్ వీడియో గ్రాఫర్స్ సంక్షేమానికి పూర్తిస్థాయిలో కట్టుబడి ఉందన్నారు. ఫొటోగ్రాఫర్స్ అత్యవసర పరిస్థితిలో ఆస్పత్రిలో చేరినా, ఆకస్మికంగా మరణించిన వారి కుటుంబానికి యూనియన్ తరపున సాయాన్ని అందించేందుకు కొత్త విధానాన్ని అమలు చేస్తున్నట్లు చెప్పారు.
త్వరలో ఫొటో అండ్ వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ భవన నిర్మాణానికి స్థలాన్ని జిల్లా అధికారులతో మాట్లాడి కేటాయిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం అసోసియేషన్ కొత్త అధ్యక్షుడిగా హుస్సేన్, జిల్లా అధ్యక్షుడిగా కంచి ఆనంద్, కార్యదర్శిగా చంద్రశేఖర్, కోశాధికారిగా శ్రీధర్ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర కోశాధికారి మాధవ రెడ్డి, కుటుంబ భరోసా ఇన్చార్జి నాగరాజ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు శ్రీధర్, ఆయా మండలాల అధ్యక్షులు పాల్గొన్నారు.
త్వరలో మెదక్ లో మహిళా పోలీస్ స్టేషన్
మెదక్, వెలుగు: మెదక్ పట్టణంలో త్వరలో మహిళా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయబోతున్నట్లు ఎమ్మెల్యే రోహిత్ తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఉమెన్ పీఎస్కోసం గతేడాది ఆగస్టులో సీఎం రేవంత్ రెడ్డి, ప్రిన్సిపల్ సెక్రటరీకి లేఖ ఇచ్చినట్టు గుర్తు చేశారు. ప్రస్తుతం పట్టణంలో ట్రాఫిక్ వింగ్ ఏర్పాటు చేయగా, త్వరలో ప్రత్యేకంగా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అలాగే మెదక్ రూరల్ సర్కిల్ పోలీస్ ఆఫీసుకు, హవేలి ఘనపూర్పోలీస్స్టేషన్లకు పక్కా భవనాలు మంజూరు కానున్నట్టు చెప్పారు.