
మెదక్ టౌన్, వెలుగు : మెదక్ నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతానని ఎమ్మెల్యే రోహిత్‌రావు అన్నారు. శుక్రవారం పట్టణంలో రూ.-146 లక్షలతో స్రీట్ వెండర్ మార్కెట్, మైనారిటీ కమ్యునిటీ హాల్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజక వర్గాన్ని అభివృద్ధిలో ముందు వరుసలో ఉంచుతానన్నారు. టీయూడబ్ల్యుజేయూ క్యాలెండర్‌ను ఆవిష్కరించారు.
కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, కౌన్సిలర్లు శేఖర్, లింగం, లక్ష్మీ, లక్ష్మీ నారాయణగౌడ్, వసంత్ రాజ్, సమీయొద్దీన్, కో-ఆప్షన్ మెంబర్ గంగాధర్, కాంగ్రెస్ నాయకులు పవన్, ఉమర్, మనోజ్, ఆంజనేయలు, హఫీజొద్దీన్, రవి, అమర్, శివరామకృష్ణ, సూఫీ, వెంకట నారాయణ, భూపతి, తాహేర్ పాల్గొన్నారు.