మెదక్ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా నిలుపుతాం :  ఎమ్మెల్యే రోహిత్ రావు 

మెదక్ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా నిలుపుతాం :  ఎమ్మెల్యే రోహిత్ రావు 

రామాయంపేట, మెదక్ టౌన్, వెలుగు: మెదక్ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా నిలుపుతామని ఎమ్మెల్యే రోహిత్ రావు అన్నారు. బుధవారం రామాయంపేట మండలం దామరచెరువు గ్రామంలో బీటీ రోడ్డు నిర్మాణానికి,  మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ.. రామాయంపేట పట్టణ, మండల అభివృద్ధికి ఇది వరకు రూ.30 కోట్ల నిధులు మంజూరు చేశామని గుర్తుచేశారు.

పట్టణంలో పదేళ్లలో చేయని పనులు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఏడాదిలోనే జరుగుతున్నట్లు చెప్పారు. అనంతరం మెదక్ పట్టణంలో, హవేలీ ఘనపూర్ మండలంలో సన్న బియ్యం పంపిణీ పథకాన్ని ప్రారంభించారు. ఆయా కార్యక్రమాల్లో కాంగ్రెస్ నాయకులు సుప్రభాత రావు, రమేశ్ రెడ్డి, సరాఫ్ యాదగిరి, అడిషనల్ కలెక్టర్ నగేశ్, ఆర్డీవో రమాదేవి, మున్సిపల్ మాజీ చైర్మన్ చంద్ర పాల్, నాయకులు  పాల్గొన్నారు.