వైభవంగా బండమీది జాతర

వైభవంగా బండమీది జాతర
  • పట్టు వస్త్రాలు సమర్పించిన  ఎమ్మెల్యే రోహిత్ 

నిజాంపేట, వెలుగు: మండల పరిధిలోని చల్మెడ గ్రామంలో గల తిరుమలనాథ స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు ( బండ మీది జాతర) వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఆలయ కమిటీ సభ్యులు మంగళవారం స్వామి వారి కల్యాణం ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే రోహిత్ రావు​ పట్టు వస్త్రాలు సమర్పించారు.

అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు. అభివృద్ధిలో మెదక్ నియోజకవర్గం ముందుండే విధంగా చూస్తానన్నారు. ఆయన వెంట ఆలయ కమిటీ చైర్మన్ రాంరెడ్డి,  సభ్యులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.