రామాయంపేటలో రూ.200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ : ఎమ్మెల్యే  రోహిత్ రావు 

 రామాయంపేటలో రూ.200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ : ఎమ్మెల్యే  రోహిత్ రావు 
  • పాపన్నపేటలో స్కిల్ యూనివర్సిటీ 
  • ఎమ్మెల్యే రోహిత్​ రావ్​

పాపన్నపేట, వెలుగు: మెదక్ నియోజకవర్గం రామాయంపేటలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ న్కూల్ నిర్మించనున్నామని, ప్రభుత్వం రూ.200 కోట్లు మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే  రోహిత్ రావు తెలిపారు. సోమవారం పాపన్నపేట మండలం ముద్దాపూర్ లో ముత్యాల పోచమ్మ ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు విద్య, వైద్యం ప్రాధాన్య అంశాలుగా తాను అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతానన్నారు.

అంతార్జాతీయ స్థాయి విలువలతో 25 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసే యంగ్ ఇండియా స్కూల్లో సుమారు 2,560 మంది విద్యార్థులు చదువుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. పావన్నపేట మండలంలో అంతర్జాతీయ స్థాయిలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామన్నారు.

ముద్దాపూర్ శివారులో రెండు బ్రిడ్జిలు, ఆలయం వరకు సీసీ రోడ్డు , బోరు మంజూరు చేయనున్నట్లు చెప్పారు. ఎమ్మెల్యేను గ్రామస్తులు సన్మానించారు. ఆయన వెంట జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి శ్రీకాంతప్ప, కొత్తపల్లి సొసైటీ చైర్మన్ త్యార్ల రమేశ్, కాంగ్రెస్ మండలాధ్యక్షుడుగోవింద్ నాయక్, ప్రశాంత్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ ఆకుల శ్రీనివాస్, మాజీ కో ఆప్షన్ సభ్యులు గౌస్, మాజీ ఏడుపాయల చైర్మన్ నర్సింలు తదితరులు పాల్గొన్నారు.