నిజాంపేట, వెలుగు: మెదక్ నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే రోహిత్ రావు అన్నారు. సోమవారం మండలానికి మంజూరైన అంబులెన్స్ ను ఆయన ప్రారంభించారు.ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి మండలానికి ఒక అంబులెన్స్ ను కేటాయించిందన్నారు.
కార్యక్రమంలో 108 జిల్లా మేనేజర్ అప్రోజ్, కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి మహేందర్, ఎంఎస్ఎస్ వో మండల ఇన్చార్జి వెంకటేశ్ గౌడ్, నజీరుద్దీన్, అమరసేనా రెడ్డి, సత్యనారాయణ రెడ్డి, ముత్యం రెడ్డి, సుప్రభాత రావు, రమేశ్ రెడ్డి, దేమే యాదగిరి, అబ్బా రెడ్డి, నరసింహారెడ్డి, నాగరాజు, అజయ్ పాల్గొన్నారు.