
మెదక్ టౌన్, నిజాంపేట్, వెలుగు: పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే రోహిత్‌రావు అన్నారు. గురువారం ఆయన మెదక్ మండలం బాలానగర్‌లో సన్నబియ్యం పంపిణీ చేసి లబ్ధిదారు ఇంట్లో భోజనం చేశారు. 33/11 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేద, ధనిక బేధాలు లేకుండా అందరికీ ఒకే రకమైన ఆహారం అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. భవిష్యత్‌లో విద్య, వైద్యరంగాలను మరింత అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. కార్యక్రమంలో విద్యుత్ శాఖ ఎస్ఈ శంకర్, అధికారులు పాల్గొన్నారు.