
మెదక్, వెలుగు: మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని ఎమ్మెల్యే రోహిత్ రావుఅన్నారు. ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా శనివారం మెదక్ పట్టణంలోని మాతా శిశు సంరక్షణ కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ వైద్యారోగ్య శాఖలో పనిచేస్తున్న మహిళా డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బంది సేవలు వెలకట్టలేనివని కొనియాడారు. అనంతరం మహిళా డాక్టర్లు, సిబ్బందిని సన్మానించారు. కార్యక్రమంలో డీసీహెచ్ శివదయాల్, జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్కిరణ్, డాక్టర్శేఖర్పాల్గొన్నారు.