
మెదక్‌టౌన్, వెలుగు: మెదక్నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు సంబంధించి అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో ముందుకు వెళ్లాలని ఎమ్మెల్యే రోహిత్‌రావు సూచించారు. మంగళవారం మెదక్‌కలెక్టరేట్ లో కలెక్టర్‌రాహుల్‌రాజ్, వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..ఏడుపాయల అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని, ఏమైనా ఇబ్బందులు ఉంటే తన దృష్టికి తీసుకురావాలన్నారు.
పంచాయతీరాజ్, రోడ్లు భవనాల శాఖల ఆధ్వర్యంలో పెండింగ్ పనులను పూర్తి చేయాలన్నారు. చెరువుల సుందరీకరణకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఇరేగేషన్ అధికారులకు సూచించారు. వేసవి కాలం దృష్ట్యా నీటి సమస్య తలెత్తకుండా చూడాలని మిషన్ భగీరథ అధికారులను ఆదేశించారు. అంతరాయం లేకుండా విద్యుత్అందించాలని విద్యుత్‌శాఖ అధికారులకు సూచించారు.
మెదక్, రామాయంపేట, మున్సిపాలిటీలలోని అన్ని గ్రామాల్లో వైకుంఠధామాలు నిర్మించాలన్నారు. ప్లానింగ్నిధుల కింద విద్యాశాఖకు రూ.2 కోట్లు కేటాయిస్తున్నామని, వీటితో స్కూళ్లలో మౌలిక వసతులు కల్పించాలన్నారు. మెదక్ పట్టణంలోని మెడికల్కాలేజీలో అవసరమైన సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నామన్నారు. సమావేశంలో డీఆర్డీవో శ్రీనివాస్‌రావు, జడ్పీ సీఈవో ఎల్లయ్య, పంచాయతీరాజ్, ఆర్అండ్బీ, మిషన్‌భగీరథ, వైద్య, ఆరోగ్య శాఖ, మున్సిపల్అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.