
తిరుమల: ఆంధ్ర ప్రదేశ్ లో వివాదాస్పదంగా మారుతున్న సినిమా టిక్కెట్ల ధరలపై అధికార పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా స్పందించారు. రాజకీయాల కోసమే ప్రతిపక్ష పార్టీలు మూవీ థియేటర్లు, టిక్కెట్ ధరల విషయంపై రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు. ఇవ్వాళ ఉదయం తిరుమల శ్రీవారిని రోజా దర్శించుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. నిర్మాతలు, స్టార్ హీరోలు, సినీ పెద్దల కోరిక మేరకే తమ ప్రభుత్వం ఆన్ లైన్ విధానాన్ని ప్రవేశ పెట్టిందని చెప్పారు. కొందరు నాయకులు, పార్టీలు రాజకీయ క్రీడ కోసం ఈ అంశాన్ని పావులా వాడుకుంటున్నాయని ఆరోపించారు. ఏపీలో బీజేపీ నేతలు ఆందోళనలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
మరిన్ని వార్తల కోసం: