మరికల్, వెలుగు: మండలంలోని రాకొండ, పూసల్పాహడ్, పెద్దచింతకుంట, వెంకటాపూర్ గ్రామాల్లో బుధవారం ఎమ్మెల్యే ఎస్ రాజేందర్రెడ్డి ప్రచారం నిర్వహించారు. ఇందులోభాగంగా రాకొండలో ఎమ్మెల్యే ప్రసంగిస్తుండగా డబుల్ బెడ్రూం ఇండ్లు ఎందుకు ఇవ్వలేదని గ్రామస్తులు నిలదీశారు. పెద్దచింతకుంటలో దళితబంధు పథకం తమకు ఇవ్వరా? అని ప్రశ్నించారు.
వెంకటాపూర్లో గ్రామ పంచాయతీ బిల్డింగ్కు ఫండ్స్ మంజూరైతే క్యాన్సిల్ చేయించారని, సీసీ రోడ్లు ఎందుకు మంజూరు చేయలేదని ఎమ్మెల్యే ప్రసంగాన్ని కాంగ్రెస్ నాయకులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. గ్రామాన్ని అభివృద్ది చేయకుండా ఎందుకు వచ్చారని ఆందోళన చేశారు. అక్కడే ఉన్న బీఆర్ఎస్ నాయకులు వారిని తిప్పికొట్టే ప్రయత్నం చేయగా, పోలీసులు కలుగ జేసుకుని ఇరువర్గాల వారిని పక్కకు పంపించారు. ఎమ్యెల్యే వాహనంతో పాటు ప్రచార రథాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించగా, పోలీసులు పక్కకు నెట్టి వాహనాలను పంపించారు.