ఇండస్ట్రియల్​ పార్క్​ ఏర్పాటు కృషి : సాంబశివరావు

ఇండస్ట్రియల్​ పార్క్​ ఏర్పాటు కృషి : సాంబశివరావు
  • ఎమ్మెల్యే సాంబశివరావు

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : కొత్తగూడెం నియోజకవర్గంలో వంద ఎకరాల్లో ఇండస్ట్రియల్​ పార్క్​ ఏర్పాటు కోసం కృషి చేస్తున్నానని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా కొత్తగూడెం సబ్​ డివిజన్​ పోలీస్​ల ఆధ్వర్యంలో కొత్తగూడెం క్లబ్​లో పలు రంగాలకు చెందిన  ప్రజలతో ఆదివారం ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. 

వంద ఎకరాల్లో ల్యాండ్​ చేస్తే ఇండస్ట్రియల్ ​పార్క్​కు సహకారం అందిస్తానని ఇప్పటికే మంత్రి శ్రీధర్​బాబు హామీ ఇచ్చారన్నారు. నియోజకవర్గంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసేందుకు రూ. 40లక్షలు ఇస్తానన్నారు. కొత్తగూడెం కార్పొరేషన్​గా మారుతున్న క్రమంలో ట్రాఫిక్​ ప్రాబ్లం లేకుండా అన్ని శాఖల అధికారులు సమన్వంతో పని చేయాలని చెప్పారు.

 కొత్తగూడెం పట్టణంలోని ముఖ్య కూడళ్లలో బ్యూటిఫికేషన్​కు ప్లాన్​ చేస్తున్నామన్నారు. ఎస్పీ రోహిత్​ రాజు మాట్లాడుతూ కొత్తగూడెంలో ట్రాఫిక్​ సిగ్నల్స్​ పనిచేయడం లేదన్నారు. మున్సిపల్​ ఆఫీసర్లు స్పందించి సిగ్నల్స్​ బాగు చేయించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. పార్కింగ్​ స్థలాలను ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే చర్యలు చేపట్టామన్నారు. సంత వ్యాపారులు రోడ్డుపై కాకుండా నిర్దేశించిన స్థలంలో వ్యాపారం చేసుకునేలా మున్సిపల్​అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. 

టర్నింగ్, ముఖ్య కూడళ్లలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయకుండా చూడాలని చెప్పారు. అనంతరం రోడ్డు భద్రతా మాసోత్సవాల పాంప్లేట్స్​ను ఆవిష్కరించారు. ఈ ప్రోగ్రాంలో ఆర్టీవో వెంకటరమణ, డీఎస్పీ రెహ్మాన్, మున్సిపల్​ కమిషనర్ ​శేషాంజన్​ స్వామి, ఆర్​ అండ్​ బీ డీఈ నాగేశ్వరరావు, తహసీల్దార్​ పుల్లయ్య, ఆర్టీసీ డీఎం దేవెందర్​గౌడ్, ఆర్టీఏ అధికారులు వెంకటపుల్లయ్య పాల్గొన్నారు.