సత్తుపల్లి, వెలుగు : అధికారంలోకి వచ్చిన వెంటనే మేనిఫెస్టోని అమలు చేస్తామని బీఆఎస్అభ్యర్థి, ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య చెప్పారు. సత్తుపల్లి మండలం రామానగరంలో మంగళవారం ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి పేద కుటుంబానికీ రూ.5 లక్షల జీవిత బీమా, అర్హులైన ప్రతి పేద మహిళకు రూ.3000 జీవన భృతి, రూ.400 లకే వంట గ్యాస్, దివ్యాంగులు ఆసరా పింఛన్లు పెంపు లాంటి పథకాలను ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో ఎంపీపీ దొడ్డ హైమావతి, సర్పంచ్ వేల్పుల కళావతి, ఎంపీటీసీ నాగభత్తిని రవి, జడ్పీటీసీ కోసం రామారావు, యాగంటి శీను, దొడ్డ శంకర్రావు, హరికృష్ణ రెడ్డి పాల్గొన్నారు.