కేసీఆర్ కు సండ్ర ఆహ్వానం

కేసీఆర్ కు సండ్ర ఆహ్వానం

సత్తుపల్లి, వెలుగు : తన పెద్ద కుమారుడు భార్గవ్ వివాహానికి హాజరు కావాలని కోరుతూ బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్ కు  మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య పెండ్లి పత్రికను అందజేశారు. శుక్రవారం ఎర్రవల్లిలోని కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్రతో కలిసి సండ్ర ఆహ్వానించారు. అక్టోబర్ 13న  హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలోని శ్రీవేంకటేశ్వర స్వామి కల్యాణమండపంలో పెండ్లి జరగనున్నట్లు సండ్ర తెలిపారు.