తల్లాడ, వెలుగు: సీఎం కేసీఆర్ ను తిడుతూ రాజకీయాలు చేస్తే సహించేది లేదని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అన్నారు. మంగళవారం తల్లాడ లో సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం 37 మంది లబ్ధిదారులకు రూ.15.67 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే మాట్లాడారు. కార్యక్రమంలో ఎంపీపీ దొడ్డ శ్రీనివాసరావు, జడ్పీటీసీ దిరిశాల ప్రమీల, ఏఎంసీ వైస్ చైర్మన్ భద్రరాజు పాల్గొన్నారు.
సత్తుపల్లి: దేశవ్యాప్తంగా రాష్ట్రపతి ప్రకటించిన ఉత్తమ పంచాయతీల్లో తెలంగాణ సత్తా చాటిందని ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అన్నారు. మంగళవారం పట్టణంలో 183 మందికి రూ.85.73 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు అందించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కూసంపుడి మహేశ్, వైస్ చైర్పర్సన్ తోట సుజల రాణి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కొత్తూరు ఉమామహేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.