మైనార్టీల సంక్షేమానికి సర్కారు పెద్దపీట : సండ్ర వెంకటవీరయ్య

సత్తుపల్లి, వెలుగు : మైనార్టీల సంక్షేమానికి తెలంగాణ సర్కార్ పెద్దపీట వేస్తోందని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య చెప్పారు. మైనార్టీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని 92 మంది ముస్లిం మహిళలకు మంజూరైన కుట్టు మిషన్లను మండల పరిధిలోని కొత్తూరు గ్రామ రైతు వేదిక వద్ద ఆదివారం పంపిణీ చేశారు. ప్రభుత్వం మైనార్టీలకు అందజేస్తున్న లక్ష రూపాయల సాయం చెక్కులను నియోజకవర్గంలోని 32 మంది లబ్ధిదారులకు అందజేశారు.

కిష్టాపురం గ్రామంలో నిర్మించిన 30 డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పట్టాలను లబ్ధిదారులకు ఇచ్చారు. బేతుపల్లి, తాళ్లమడ, చెరుకుపల్లి, కిష్టాపురం, నారాయణపురంలో రూ. 11.58 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని వర్గాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. కార్యక్రమాల్లో ఎంపీపీ దొడ్డ హైమావతి, జడ్పీటీసీ కోసం పూడి రామారావు, సర్పంచుల  సంఘం అధ్యక్షుడు మందపాటి శ్రీనివాసరెడ్డి, ఎంపీటీసీల సంఘం అధ్యక్షుడు మందపాటి కృష్ణారెడ్డి, ఆత్మ కమిటీ మాజీ చైర్మన్ శీలపరెడ్డి హరికృష్ణ రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు యాగంటి శ్రీనివాసరావు ఉన్నారు.