ఈ ఒక్కసారి గెలిపించండి ..మళ్లీ పోటీ చేయను.. బ్రతిమిలాడిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే

చేసిన అభివృద్ధి పనులను చెప్పుకుని..ఓట్లు అడగమని అధినేత కేసీఆర్..తమ ఎమ్మెల్యేలకు సూచిస్తే..బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాత్రం ఒక్క ఛాన్స్ అంటూ ఓటర్లను ప్రాధేయపడుతున్నారు. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ..ఈ ఒక్కసారి తనను గెలిపించాలని ఓటర్లను బతిమిలాడారు. బీఆర్ఎస్ అధిష్టానం తనకు మరోసారి టికెట్ ఇచ్చే ఆలోచనలో ఉందని. అందరూ అశీర్వదిస్తే ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని చెప్పారు. 

ALSO READ :గెస్ట్ లెక్చరర్ల ఆందోళన... అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలె

ఇదే చివరి సారి..

2014 ఎన్నికల్లో ఇదే చివరి ఎన్నిక అంటూ జీవన్ రెడ్డి ప్రజల ముందు ప్రకటించి గెలిచారని.. కానీ ఆయన మళ్లీ 2018 ఎన్నికల్లోనూ పోటీ చేశారని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గుర్తు చేశారు. కానీ ప్రజలు మాత్రం తనను భారీ మెజారిటీతో గెలిపించారని చెప్పారు. ఇప్పుడు మరోసారి  జగిత్యాల నుంచి జీవన్ రెడ్డి లేదా.. అతని కొడుకో పోటీ చేయబోతున్నారని..తెలిపారు. కానీ తాను మాత్రం జీవన్ రెడ్డి లా  మాట మార్చనన్నారు. ఇదే తన చివరి ఎన్నికని.. ఇక ముందు పోటీ చేసే ఆలోచన తనకు లేదన్నారు. కాబట్టి ఈ సారి ఓటర్లు తనను గెలిపించాలని బతిమిలాడారు. 

జగిత్యాల మండలం కల్లెడ గ్రామంలోని రైతు వేదికలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఈ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ మూడు గంటల కరెంట్ విధానంపై నిర్వహించిన కార్యక్రమంలో  ఓటర్లు,  రైతులను అభిప్రాయం అడిగారు.