జగిత్యాల, రాయికల్, వెలుగు: కాంగ్రెస్ నాయకులు రైతు వ్యతిరేకులని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ విమర్శించారు. గురువారం జగిత్యాలలోని బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో మీడియాతో మాట్లాడారు. ఎంపీ ఉత్తమ్ కుమార్‌రెడ్డి రైతుబంధును ఆపాలని ఎలక్షన్ కమిషన్‌కు ఫిర్యాదు చేయడం ఆ పార్టీకి రైతులపై ఉన్న వ్యతిరేకతకు నిదర్శనమన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ ఐదు గంటలు కూడా కరెంటు ఇవ్వలేక చేతులెత్తేయడంతో ఆ రాష్ట్ర రైతులు ఆ పార్టీపై తిరగబడుతున్నారన్నారు.
రాష్ట్రంలో రైతుబంధుతో రైతులు సగర్వంగా పంటలు పండిస్తున్నారన్నారు. అంతకుముందు రాయికల్ మండలం అల్లీపూర్ గ్రామంలో ఎమ్మెల్యే ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు యువకులు బీఆర్ఎస్‌లో చేరారు. ఆయన మాట్లాడుతూ 60 ఏళ్లలో జరగని అభివృద్ధి 9 ఏండ్లలో చేసి చూపించామన్నారు. చక్కర ఫ్యాక్టరీని మూసివేయించింది కాంగ్రెస్సేనని ఆరోపించారు. పసుపు రైతుల పట్ల బీజేపీకి చిత్తశుద్ధి లేదన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్, ప్యాక్స్‌చైర్మన్ సందీప్ రావు, దామోదర్ రావు, రాయికల్ఏఎంసీ డైరెక్టర్ సాయిరెడ్డి, రత్నాకర్‌రావు, ముఖీద్, మహేశ్, సాగర్‌రావు, సత్యం, ప్రశాంత్, శ్రీను, సంజీవరావు, భీమన్న తదితరులు పాల్గొన్నారు.