
జగిత్యాల జిల్లా: జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ డ్యాన్స్ చేశారు. శనివారం రాత్రి మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ లియాఖాత్ అలీ మోహసీన్ కుమార్తె మెహంది పంక్షన్ కు హాజరైన వేడుకలో కళాకారులు తబలా వాయిద్యాల మధ్య ఘజల్స్ పాడుతుంటే మైమరచిపోయారు. కొద్దిసేపటికి పంక్షన్ లో నిర్వహిస్తున్న దొలక్ గీత్ పై కుటుంబ సభ్యులతో కలిసి స్టెప్పులు వేశారు. ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ మైమరచిపోయి స్టెప్పులేసి ఫంక్షన్లో హాజరైన వారిని హుషారెత్తించారు.