జగిత్యాల టౌన్, వెలుగు : ఎల్ఆర్ఎస్ ఫీజు రద్దు చేయాలని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం జగిత్యాల కలెక్టర్ యాస్మిన్ బాషాకు వినతిపత్రం ఇచ్చారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో బీఆర్ఎస్ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ ను తీసుకువచ్చినప్పుడు ప్రస్తుత మంత్రులు భట్టి విక్రమార్క, సీతక్క
ఉత్తమ్ కుమార్ లు వ్యతిరేకించారని, ఇప్పుడు ఎల్‌ఆర్‌ఎస్‌కు ఫీజు ఎందుకు వసూల్చేస్తున్నారని ప్రశ్నించారు. రాయికల్ మున్సిపల్ చైర్మన్ హనుమండ్లు, జడ్పీటీసీ అశ్విన్ జాదవ్, వైస్ చైర్మన్ శ్రీనివాస్, కౌన్సిలర్లు, లీడర్లు పాల్గొన్నారు.