ఎమ్మెల్యే సంజయ్ కుమార్.. పండుగ సరదా

జగిత్యాల జిల్లా: సంక్రాంతి పండుగ సెలవులను ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఆస్వాదిస్తూ ఆనందంగా గడిపే ప్రయత్నం చేస్తున్నారు. నిన్న శనివారం రాత్రి జగిత్యాల మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ లియాఖాత్ అలీ మోహసీన్ కూతురు మెహందీ పంక్షన్  సందర్భంగా డోలక్ గీత్ పై వారి కుటుంబ సభ్యులతో కలిసి స్టెప్పులు వేసిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఆదివారం ఉదయం బీఎండబ్ల్యూ బైక్ నడిపి ముచ్చట తీర్చుకున్నారు. భూషణం అనే వ్యక్తి రూ. 3.6 లక్షల విలువైన బీఎండబ్ల్యూ ( BMW) కొత్త బైక్ కొనుగోలు చేసి దానిపై  MLA డాక్టర్ సంజయ్ కుమార్ ను కలిసేందుకు వచ్చాడు. బైక్ ముచ్చటగా కనిపించడంతో దాని వివరాలను అడిగి తెలుసుకున్న ఆయన సరదాగా ఓ రౌండ్ వేసి వచ్చారు. MLA సంజయ్ కుమార్ బైకు నడుపుతుంటే స్థానికులు, కార్యకర్తలు వీడియోలు తీసి షేర్ చేశారు. నిన్న డ్యాన్సులు, నేడు బైక్ రైడింగ్ అంటూ ట్రోల్ చేస్తున్నారు. 
 

ఇవి కూడా చదవండి

మెహందీ ఫంక్షన్లో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ డ్యాన్స్

శ్రీవల్లి పాటకు స్టెప్పులేసిన క్రికెటర్లు