కేసీఆర్ నాయకత్వంలో ఆలయాలకు మహర్దశ : సంజయ్ కుమార్

జగిత్యాల టౌన్, వెలుగు : సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలో ఆలయాలకు మహర్దశ వచ్చిందని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. పట్టణంలోని ఎస్డీఎఫ్ నిధులు రూ.20లక్షలతో నవదుర్గ ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

అనంతరం నవదుర్గ సేవ సమితి కరపత్రాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో లీడర్లు గోలి శ్రీనివాస్, ప్రేమలత సత్యం, సతీశ్‌‌‌‌, నవదుర్గ సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు.